
న్యూస్

అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుండగా, హీరోయిన్ విషయంలో ఉన్న సస్పెన్స్ తాజాగా క్లియర్ అయింది. ఒక ఈవెంట్లో అనిల్ రావిపూడి కృతి శెట్టిని త్వరలో సెట్స్‌లో కలుద్దామని చెప్పడంతో, ఆమె కల్యాణ్ రామ్ సరసన నటించనుందని స్పష్టమైంది.
ఇక వెంకటేష్ సరసన కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, కృతి శెట్టిపై దర్శకుడు నమ్మకం ఉంచారు. ఆమె నటన, తెలుగు మాట్లాడే తీరు మెచ్చుకున్న ఆయన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమెకు మంచి అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ భారీ సినిమా ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు.
.jpeg&w=3840&q=75)


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!