
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన నియమాలను ప్రతిపాదిస్తూ వాటిపై ప్రజాభిప్రాయం కోరుతోంది. అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) మార్చి 27న హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికుల వేతనాలను రక్షించడం లక్ష్యంగా కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మార్పులు ప్రధానంగా వేతనాలు మరియు అర్హతలపై దృష్టి సారించాయి. జూన్ 30లోపు దాఖలైన పిటిషన్లపై ఈ మార్పులు ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాల కోసం 60 రోజుల గడువు ఇచ్చారు.
ఈ ప్రతిపాదనల ప్రకారం హెచ్-1బీ వీసాను శాశ్వత నివాసానికి మార్గంగా ఉపయోగించకుండా నిరోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే ఇవ్వబడే వీసా అని స్పష్టం చేసింది. అమెరికా యూనివర్సిటీల్లో మాస్టర్స్ లేదా అంతకంటే పై స్థాయి విద్య పూర్తి చేసిన వారికి వీసా కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే విదేశీయులను నియమించే ముందు ఆ ఉద్యోగానికి సరైన అమెరికన్ అభ్యర్థి లేడని కంపెనీలు నిరూపించాలి. తక్కువ వేతనాలకు విదేశీయులను నియమించకుండా ఉండేందుకు కనీస వేతనాన్ని 30 శాతం పెంచాలని ప్రతిపాదించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!