
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ఏప్రిల్ 1 నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరానికి వెళ్లే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి. తర్వాత ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ విధానం అమల్లోకి రావడంతో పబ్లిక్ పరీక్షల తర్వాతే క్లాసులు పెట్టేలా ప్లాన్ చేశారు.
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 232 రోజులు కళాశాలలు పని చేస్తాయి. అక్టోబర్ 5 నుంచి 9 వరకు త్రైమాసిక పరీక్షలు, నవంబర్ 25 నుంచి 30 వరకు అర్ధవార్షిక పరీక్షలు ఉంటాయి. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 20 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 9 నుంచి 17 వరకు ఉంటాయి. జనవరి 19 నుంచి 23 వరకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి లేదా మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. మార్చి 18తో విద్యాసంవత్సరం ముగుస్తుంది. అలాగే ర్యాంకులు గ్యారెంటీ అని చెప్పి ప్రకటనలు చేయకూడదని ప్రైవేట్ కళాశాలలకు హెచ్చరికలు జారీ చేశారు.





.webp&w=3840&q=75)












.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!