
క్రీడలు

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు కనుకుంట్ల రాజేందర్ (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. గతంలో కండక్టర్‌గా పనిచేసిన రాజేందర్ అనంతరం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.
స్నేహితుడిని కలవడానికి కలికిరికి వెళ్లిన ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్వగ్రామంలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!