
సినిమాలు

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భద్రాచలం సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ గ్రామాలను భద్రాచలంలో కలిపితే పాలన సులభంగా ఉంటుందని తెలిపారు.
ఈ విలీనం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ చర్య వల్ల స్థానిక ప్రజలకు మేలు జరుగుతుందని, పాలన మరింత సులభమవుతుందని అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!