

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా ఫస్ట్ లుక్‌తోనే భారీ అంచనాలు తెచ్చుకుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ప్రారంభంలో రూ.800 కోట్ల బడ్జెట్‌గా భావించిన ఈ సినిమా, తాజా సమాచారం ప్రకారం రూ.900 నుంచి రూ.1000 కోట్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువల కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడడం లేదని సమాచారం.
ఈ ప్రాజెక్టులో నటీనటుల పారితోషికాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అల్లు అర్జున్ ఈ సినిమాకు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకొనేకు సుమారు రూ.25 కోట్లు, మరో కీలక పాత్రలో కనిపించనున్న రష్మిక మందన్నకు రూ.5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!