

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అందరూ పేర్కొంటున్న పేరు మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మరాఠీ నటి, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’తో మరో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’లో కూడా ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ‘కల్కి’ సినిమాలో చిన్న కామియో పాత్రలో కూడా మెరిశారు. అయితే ఇన్ని విజయాలు సాధించినప్పటికీ, మృణాల్ మనసులో ఒక చిన్న భయం ఎప్పుడూ ఉండేదని ఇటీవల ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ వెల్లడించారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ ప్రేమకథా చిత్రం ‘డెకాయిట్’ షనీల్ దేవ్ దర్శకత్వంలో రూపొందగా, ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరైన శౌర్యువ్, మృణాల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘హాయ్ నాన్న’ షూటింగ్ సమయంలో మృణాల్ తరచూ తనకు ఫోన్ చేసి, “నాకు ఇక తట్టుకోలేకపోతున్నాను… తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించరేమో” అని బాధపడేదని ఆయన తెలిపారు. భాష పరమైన ఇబ్బందులు, పాత్రలో పూర్తిగా ఒదిగిపోవాలనే ఒత్తిడి కారణంగా ఆమె అలా భావించేదని చెప్పారు. అంతేకాక, “ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు” అని కూడా చెప్పేదని, అయితే ఆ మాటలను తాను పెద్దగా పట్టించుకోలేదని శౌర్యువ్ అన్నారు. అయితే ‘హాయ్ నాన్న’ విడుదల తర్వాత తెలుగు ప్రేక్షకులు మృణాల్ నటనకు ఫిదా అయ్యారని, యష్ణ పాత్రకు మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఒక లోకల్ స్టార్‌లా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ‘డెకాయిట్’ కూడా మంచి విజయం సాధిస్తుందని, ఈ సినిమా ద్వారా మృణాల్‌కు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని, ఆమెను తెలుగు సినీ పరిశ్రమలో నుంచి ఎవరూ తప్పించలేరని శౌర్యువ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ‘హాయ్ నాన్న’లో చివర్లో ఫైట్ చేసిన మృణాల్, ‘డెకాయిట్’లో మొదటి నుంచే సరస్వతి పాత్రలో యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తుందని, ఈ సినిమాతో ఆమె ఖాతాలో మరో హిట్ చేరుతుందని ఆయన తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!