
సినిమాలు

నారా లోకేష్ రాష్ట్రంలో కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉండవల్లి లో జరిగిన సమావేశంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సృష్టించే ప్రతి ఉద్యోగంపై పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
అధికారులు ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించినట్లు వివరించారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు, అలాగే ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!