
క్రీడలు

క్యూనెట్ కేసులో సిట్ కీలక విషయాలను వెలికితీసింది. 10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిందితులు ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆకర్షణీయమైన ఆఫర్లతో వారిని వలలో వేసినట్లు వెల్లడైంది.
బ్యాంక్ లోన్లు ఇప్పించి క్యూనెట్‌లో చేరేలా చేసి, ఈఎంఐల బారిన పడేలా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఒక్కో ఏజెంట్ సుమారు 500 మంది ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు సమాచారం. బాధితుల నుంచి ముందుగానే బాండ్‌లు రాయించుకుని బయటకు రాకుండా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!