

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యార్థులకు 24 అవసరమైన వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కిట్లలో యూనిఫాం నుంచి ట్రంక్ బాక్స్ వరకు అన్ని సదుపాయాలు అందించనున్నారు. ఈ పథకం సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, మోడల్ స్కూల్స్ మరియు గిరిజన పాఠశాలల్లో అమలు చేయనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 5 లక్షల మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అలాగే డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్టులు అందించనుండగా, మరో 19 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ముందే ఈ పంపిణీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, 45 రోజుల్లో సరఫరా పూర్తి చేయాలని గడువు విధించారు. ఆలస్యమైతే జరిమానా విధించి, బ్లాక్ లిస్ట్‌లో చేర్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి వస్తువుకు బార్‌కోడ్ అమలు చేసి పారదర్శకతను నిర్ధారించనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!