

అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల్లో భాగంగా కువైట్‌లోని జల మరియు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. అదే సమయంలో ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో ఉన్న భారీ చమురు రిఫైనరీపై కూడా ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా అక్కడ మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. అయితే, వాటిలో ఐదు క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అలాగే దుబాయ్ వైపు దూసుకెళ్లిన ఒక క్షిపణిని కూడా రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చేశాయి.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని ప్రధాన అణు పరిశోధనా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ దాడులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!