

ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక సారధి ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (69 నాటౌట్) పేరిట ఉండేది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ ఈ ఘనత సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్‌కు చేరాడు.
ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ మరో ముఖ్యమైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆయన ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సంజు శాంసన్ (119), మయాంక్ అగర్వాల్ (99 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (93 నాటౌట్), ఫాఫ్ డు ప్లెసిస్ (88), కీరన్ పొలార్డ్ (83) తరువాత ఇషాన్ కిషన్ 80 పరుగులతో చోటు సంపాదించాడు. ఈ ప్రదర్శనతో తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను గుర్తుండిపోయేలా చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. జట్టు 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి జట్టును గట్టెక్కించాడు. అతనికి క్లాసెన్ (31) కొంతసేపు సహకరించాడు. 18 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా నిలిచింది. అనికేత్ వర్మ (27), డేవిడ్ పేన్ (1) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీసుకోగా, రొమారియో షెపర్డ్ 2 వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!