

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఎన్నికలకు 27 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి బరిలోకి దిగుతున్నారు.
అవనాశి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పోటీ చేస్తుండగా, కోయంబత్తూరు ఉత్తర నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. మోడక్కురిచి నుంచి కృతిక శివకుమార్, విలవన్కోడ్ నుంచి ఎస్ విజయధరణి, తళ్లి నుంచి నాగేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, అలాగే నటుడు విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!