
సినిమాలు

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు విజయం అందించాడు. అయితే అదే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు ఐపీఎల్ గుర్తించింది. దీంతో కెప్టెన్ అయ్యర్‌పై రూ.24 లక్షల జరిమానా విధించారు.
ఇది ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు రెండోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదం కావడం గమనార్హం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. మొదటి తప్పిదానికి రూ.12 లక్షల జరిమానా విధించగా, రెండోసారి తప్పు చేయడంతో జరిమానాను రెట్టింపు చేశారు. అంతేకాకుండా జట్టులోని మిగతా ఆటగాళ్లపై కూడా రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం వరకు కోత విధించనున్నారు.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!