
సినిమాలు

విశాఖపట్నం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్ లోపం కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు వెంటనే విమాన నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించారు. దీనికి స్పందించిన విమానాశ్రయ అధికారులు అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులను సిద్ధం చేసి భద్రతా చర్యలు చేపట్టారు.
విమానం ఉదయం 10:59 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 161 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాథమిక తనిఖీల అనంతరం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్ లోపానికి గల కారణాలను విమానయాన నియంత్రణ సంస్థ మరియు సాంకేతిక బృందం పరిశీలిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!