

మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా అధికారులకు లొంగుబాటు ప్రకటించారు. గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన బర్సే దేవా, హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు కూడా ఆయన వద్దే ఉన్నాయి.
హిడ్మా మరియు బర్సే దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని ఒకే గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా ముఖ్యమైన పాత్ర పోషించినట్టు సమాచారం. నిన్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి బర్సే దేవా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తీసుకొచ్చారు. బర్సే దేవా లొంగుబాటు సంబంధిత పూర్తి వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!