
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతమైంది. దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడికి పంపాలనే లక్ష్యంతో ఈ మిషన్ ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీన ఫ్లోరిడా నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యోమనౌక 6వ తేదీన చంద్రుడికి అత్యంత సమీపంగా వెళ్లి పాత రికార్డును అధిగమించింది.
ఇప్పుడు ఈ వ్యోమనౌక భూమికి తిరిగి వస్తోంది. వ్యోమగాములు ఇప్పటికే భూమికి సగం దూరం చేరుకున్నారని నాసా తెలిపింది. ఈ రోజు రాత్రి 8 గంటల 7 నిమిషాల సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో దిగే అవకాశం ఉందని సమాచారం ఇచ్చింది.
సురక్షితంగా దిగేందుకు సముద్రంలో రక్షణ నౌక సిద్ధంగా ఉంది. వ్యోమనౌక దిగే ముందు దాని వేగాన్ని తగ్గించడానికి పదకొండు పారాచూట్లు తెరుచుకోనున్నాయి. ఈ మిషన్ విజయవంతం కావడంతో తదుపరి దశగా ఆర్టెమిస్ 3 మిషన్ చేపట్టి మనుషులను చంద్రుడిపై దింపే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!