
సినిమాలు

పాకిస్తాన్లో ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏడుగురు శిశువులు మరణించగా, వారిలో నలుగురికి ఎంపాక్స్ సోకినట్లు ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్పూర్ ప్రాంతంలో ఈ కేసులు వెలుగులోకి రావడం మరింత ఆందోళనకు దారితీసింది.
పుండ్లు, ఫ్లూ లక్షణాలు, అధిక జ్వరంతో బాధపడుతూ ఖైర్పూర్ ఆసుపత్రుల్లో చేరిన శిశువులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తులు లేదా జంతువులతో సన్నిహితంగా ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!