

ఐపీఎల్ 2026 సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ ఒకవైపు ఉండగా, వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మరోవైపు నిలుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, పతిరన వంటి కీలక బౌలర్లు దూరం కావడంతో కోల్‌కతా బౌలింగ్ విభాగం బలహీనపడింది. సొంత మైదానంలో పంజాబ్‌ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్‌లో విఫలమైన రహానే సేన, తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బంతితో పరుగులు అదుపు చేయలేకపోయింది. బ్యాటింగ్‌లోనూ స్థిరత్వం లేకపోవడంతో మరో ఓటమి చవిచూసింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక దూకుడు మీద ఉన్న పంజాబ్ కింగ్స్‌ను అడ్డుకోవాలంటే కోల్‌కతా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు గుజరాత్ టైటాన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించగా, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమూ ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!