

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) నిశ్చితార్థం గతేడాది జరిగింది. ముంబై పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో అతడి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్చ్లోనే వారు పెళ్లిపీటలెక్కనున్నట్టు సమాచారం.
అయితే, ఈ వార్తలపై సచిన్ కుటుంబం స్పందించాల్సి ఉంది గతేడాది ఆగస్టులో అర్జున్, సానియాల నిశ్చితార్థం జరిగింది. సన్నిహితులు, స్నేహితుల మధ్య గోప్యంగా ఈ వేడుక జరిగింది. ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల గురించి అభిమానులు ఎక్స్ వేదికగా సచిన్ను ప్రశ్నించారు. దీంతో, సచిన్.. తన తనయుడి నిశ్చితార్థం జరిగిందని తొలిసారిగా ధ్రువీకరించారు. అతడు తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కూడా కామెంట్ చేశారు.
ఇక జాతీయ మీడియా ప్రకారం, మార్చ్ 5 న అర్జున్, సానియాల వివాహం జరగనుంది. మార్చ్ 3 నుంచే ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే, నిశ్చితార్థం లాగానే పెళ్లిని కూడా నిరాడంబరంగా అత్యంత సన్నిహితులు, ఇతర ప్రముఖుల మధ్య నిర్వహించేలా సచిన్ కుటుంబం ప్లాన్ చేస్తోంది. పలువురు క్రికెట్ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!