
న్యూస్

ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రిడిక్షన్ పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. కొందరు వ్యక్తులు మరియు ప్రభావశీలులు తప్పుడు ప్రచారాలు చేస్తూ టాస్ ఫలితం, మ్యాచ్ విజేతలను ముందే చెబుతామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్నారు. తమ ఛానెళ్లలో చేర్పించి చివరకు బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతూ ఆర్థిక నష్టాలకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్ సైబర్ నేర విభాగం ఈ మోసాలపై కఠిన చర్యలు చేపట్టింది. గత నెలలోనే 494 చెల్లింపు ప్రకటనలు, 129 సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించింది. ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా సంబంధిత పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!