
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కీలక పరిపాలనా మరియు అభివృద్ధి అంశాలపై చర్చ జరగనుంది. అమరావతి చట్టానికి ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధాని మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. అలాగే 16 వ SIPB సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేలా రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.




















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!