
న్యూస్

పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తమ కుటుంబానికి ఈ నెల 8వ తేదీ ఎంతో భావోద్వేగంగా మారిందని తెలిపారు. ఇదే రోజున తమ కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు జరుపుకుంటున్నామని, గత సంవత్సరం ఇదే తేదీన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా ప్రభావితమయ్యారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి మార్క్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని పేర్కొంటూ, ఈ తేదీ తమకు సంబరంతో పాటు ఓ జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పారు.

సింగపూర్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, న్యాయం ఇప్పటికీ జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనలో పిల్లలను కాపాడిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఒక తల్లిగా ఆ అనుభవం తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!