

హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చిన ఈ డైవర్షన్స్ సుమారు ఏడాది పాటు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
డైవర్షన్స్ ప్రకారం, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను విప్రో జంక్షన్, గౌలిదొడ్డి మార్గంగా మళ్లిస్తున్నారు. గోపన్‌పల్లి, క్యూ-సిటీ, కోకాపేట్ నుంచి వచ్చే వాహనాలను నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్ మార్గంగా మళ్లిస్తున్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌ఎంఆర్/హెచ్‌సీయూ బస్ డిపో, మజీద్‌బండ, బొటానికల్ జంక్షన్ మార్గంగా మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ముందుగా ప్రణాళిక చేసుకుని సహకరించాలని పోలీసులు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!