
న్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “రాకా” సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఫస్ట్ లుక్‌లో బన్నీ పూర్తిగా కొత్తగా కనిపించిన గుండు లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది.
“రాకా” అనే టైటిల్ కూడా కథపై ఆసక్తిని పెంచుతోంది. సంస్కృతంలో రాకా అంటే పౌర్ణమి అని అర్థం. పురాణాల్లో రాకా దేవి ప్రస్తావన కూడా ఉండటంతో ఈ కథను మిస్టిక్ మరియు డార్క్ ఎలిమెంట్స్‌తో ముడిపెడుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ మిస్టరీ టచ్ కారణంగా సినిమా కథపై మరింత ఆసక్తి పెరిగింది.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!