
సినిమాలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. బారామతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ల్యాండింగ్ సమయంలో విమానం కూలినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. విమానంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదం అనంతరం అజిత్ పవార్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక స్పష్టత వెలువడలేదు. ప్రమాదానికి గల కారణాలు, మిగిలిన ప్రయాణికుల పరిస్థితి, నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!