
తెలుగు నటుడు శివాజీ తాజాగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. తన సినిమాలు విడుదల కాకముందే కొందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆరోపిస్తూ, సోషల్ మీడియా ట్రోలర్లను “పేటీఎం బ్యాచ్” అంటూ విమర్శించారు. వంద మంది సబ్‌స్క్రైబర్లు కూడా లేని వారు తన గురించి మాట్లాడుతున్నారని, అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. “నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరం” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాజకీయాల విషయానికొస్తే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఆసక్తి లేదని చెప్పినప్పటికీ, అమరావతి రైతుల కోసం ఏ పార్టీపై అయినా పోరాడతానని తెలిపారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశ్నిస్తానని అన్నారు. అలాగే సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే రాజకీయ నాయకులపై ఉన్న కేసులపై వేగంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ భయపడనని, అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకోనని శివాజీ హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!