

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్‌ను సంతోషపెట్టడానికి ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
ఇండియా కూటమి దక్షిణ భారత రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసిందని, మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వడంలో విఫలమైందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ మాత్రం ప్రతిభ ఆధారంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముద్ర లోన్లు, ఎంఎస్ఎంఈ సబ్సిడీలు, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక బలం కల్పిస్తున్నామని ఆమె వివరించారు.Shobha Karandlaje, Congress criticism,






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!