
సినిమాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు మ్యాచ్ టికెట్లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాయి. ఐపీఎల్‌ను వినోదంగా కాకుండా క్రీడగా పరిగణిస్తే, టికెట్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించవచ్చని అవి సూచించాయి. ప్రస్తుతం టికెట్లపై సుమారు 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
మునుపు ఈ పన్ను 28 శాతం ఉండగా, గత ఏడాది సెప్టెంబర్‌లో 40 శాతానికి పెంచారు. ఈ అధిక పన్ను కారణంగా అభిమానులపై భారం పెరుగుతోందని, స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడుతోందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. అందుకే జీఎస్టీ తగ్గించి క్రికెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాయి.








.jpeg&w=3840&q=75)







.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!