
దేశవ్యాప్తంగా 32 విద్యాసంస్థలను నకిలీ విశ్వవిద్యాలయాలుగా గుర్తించినట్లు విశ్వవిద్యాలయ మంజూరు సంఘం వెల్లడించింది. ఈ సంస్థలు జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి చట్టబద్ధ గుర్తింపు ఉండదని స్పష్టంచేసింది. ఇలాంటి సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్లు ఉద్యోగాలు లేదా ఉన్నత విద్యలో చెల్లవని యూజీసీ హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రవేశాలు తీసుకునే ముందు సంబంధిత సంస్థకు అధికారిక గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది.
నకిలీ జాబితాలో ఢిల్లీలో అత్యధికంగా 12 సంస్థలు ఉండగా, ఉత్తరప్రదేశ్లో 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకు చెందిన ‘క్రైస్ట్ న్యూ టెస్టమెంట్’ మరియు విశాఖపట్నంలోని ‘బైబిల్ ఓపెన్ వర్సిటీ’ కూడా జాబితాలో చోటుచేసుకున్నాయి.
అదనంగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనూ కొన్ని నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు వెల్లడించింది. గుర్తింపు లేని సంస్థల్లో చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని యూజీసీ మరొక్కసారి స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!