

జైపూర్లోని ఒక తండ్రి తన కుమార్తెకి చూపిన అపూర్వమైన ప్రేమతో అందరిని ఆశ్చర్యపరిచాడు. శివ్ జోహ్రి, తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహానికి 3 కిలోల స్వచ్ఛమైన వెండితో అద్భుతమైన శుభలేఖను రూపొందించారు. దీని విలువ సుమారు 25 లక్షలు. ప్రత్యేకంగా 128 వెండి ముక్కలతో, ఒక్క మేకు లేదా స్క్రూ ఉపయోగించకుండా పత్రిక రూపొందించడం విశేషం.
ఈ పత్రికపై 65 మంది దేవతామూర్తులను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. పైన వినాయకుడి విగ్రహంతో “శ్రీ గణేశాయ నమః” అని రాసి ఉంది. ఆయన కుడివైపు పార్వతీ, ఎడమవైపు పరమశివుడు, వారి కింద లక్ష్మీ, విష్ణు విగ్రహాలు చూపించారు. శ్రీకృష్ణుని జీవిత ఘట్టాలు, విష్ణువు దశావతారాలు, అష్టలక్ష్మి రూపాలు, సూర్యభగవానుడు, వేంకటేశ్వరస్వామి వంటి దైవ స్వరూపాలు కూడా శ్రద్ధగా ప్రతిబింబించబడ్డాయి. శివ్ జోహ్రి, ఈ పత్రికను ఏడాది పాటు స్వయంగా తయారుచేశారని, తన కుమార్తెకు స్మరణీయమైన కానుక ఇవ్వాలన్న కోరికతో ఇది రూపొందించాడని తెలిపారు. వధూవరులైన శ్రుతి జోహ్రి, హర్ష్ సోని పేర్లు మధ్యలో చెక్కబడ్డాయి, చుట్టుపక్కల ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెండిపైనే ముద్రించబడ్డాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!