

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం నమోదై భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. రిక్టర్ స్కేలు పై ఈ కంపనం తీవ్రత 4.2 గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉదయం సుమారు 7:26 గంటలకు, భూగర్భంలో 35 కి.మీ. లోతులో ఈ భూకంపం నమోదైనట్టు వివరించారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని NCS ఎక్స్ వేదికలో పేర్కొంది.
గత నెల 21 న హిందూ మహా సముద్రం ప్రాంతంలో కూడా ఇలాంటి స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నమోదు అయిన తీవ్రత 4.3 కాగా, కంపనం 10 కి.మీ. లోతులో ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం హర్యానా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 3.2 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదు కాగా, రాత్రి 9:22 గంటల సమయంలో సోనీపట్ పరిసరాల్లో భూగర్భంలో 5 కి.మీ. లోతులో కేంద్రాన్ని గుర్తించినట్టు NCS తెలిపింది.
ఇక ఆదివారం పొరుగు దేశం నేపాల్లోని సూదూర్ పశ్చిమ్ ప్రావిన్సులోని బజాంగ్ జిల్లాలో 4.4 తీవ్రతతో మరో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూడా ఎలాంటి నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (2)
ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండటం చాలా అవసరం
Stay safe everyone!