.jpg&w=3840&q=75)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'రాకా' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఎన్నో చర్చలకు దారితీస్తుంది. బీస్ట్ లాంటి బన్నీ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. చూస్తుంటే మానవ డిఎన్ఏ మార్పుల వల్ల మనిషి బీస్ట్ గా మారే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని అర్థమవుతుంది. అయితే గతంలో శంకర్ - విక్రమ్ కాంబోలో వచ్చిన 'ఐ' సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేశారు. కానీ సినిమా స్టోరీని రివేంజ్ లవ్ స్టోరీగా చూపించి షాక్ ఇచ్చారు శంకర్.
అట్లీ గతంలో శంకర్ హిట్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు తన రాకా సినిమాతో ఈ బీస్ట్ కాన్సెప్ట్ ని చూపించబోతున్నాడు. అయితే తన గురువు శంకర్ లాగే ఈ కాన్సెప్ట్ ని కేవలం పాటకే పరిమితం చేస్తాడా? అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ కమర్షియల్ సినిమాల్లో దిట్టైన అట్లీ తన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తో కచ్చితంగా సంచలానాలు సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!