
సినిమాలు

తమిళ సినీ పరిశ్రమలో హీరో విజయ్‌తో ప్రేమలో ఉన్నారనే రూమర్లపై హీరోయిన్ త్రిష కృష్ణన్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయంపై నేరుగా మాట్లాడకపోయినా, తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా విజయ్‌తో సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు వైరల్ అవుతుండగా, త్రిష షేర్ చేసిన కోట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
‘మన శాంతికి భంగం కలిగించే దేన్నైనా వదిలేయాలి’, ‘మన విలువ మనకు తెలిసినప్పుడు ఇతరుల మాటలు ప్రభావం చూపవు’ వంటి అర్థం వచ్చే సందేశాలను ఆమె పంచుకున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో మౌనం ఉత్తమ సమాధానం అని సూచించే పోస్టులు కూడా చేశారు. ఈ కోట్స్‌ను ఆమెపై వస్తున్న పుకార్లకు సమాధానంగానే అభిమానులు భావిస్తున్నారు. దీంతో రూమర్లపై త్రిష స్టైలిష్‌గా స్పందించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!