
సినిమాలు

ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోనీ మరింత కాలం పాటు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ విషయాన్ని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. దీంతో ధోనీ రాకపై ఎదురుచూస్తున్న అభిమానుల్లో నిరాశ నెలకొంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తొలుత రెండు వారాల పాటు దూరంగా ఉంటాడని చెప్పినా, ఇప్పుడు ఆ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. టోర్నీ ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో ధోనీ రాకపై అనిశ్చితి కొనసాగుతుండగా, బోణీ కోసం ఎదురు చూస్తున్న చెన్నై జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!