

భారత్–దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ శనివారం విశాఖలో రసవత్తరంగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. టికెట్లు విడుదలైన కొద్దిసేపటికే హాట్‌కేకుల్లా అమ్ముడవడంతో స్టేడియం పరిసరాల్లో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకోవడానికి, తమ టికెట్లో ఉన్న గేటుకు సరైన మార్గం ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం గేటు నంబర్ల వారీగా ప్రవేశ మార్గాలను ఇలా గుర్తించారు:
1వ గేటు
జాతీయ రహదారి పై స్టేడియం సిగ్నల్‌కు ఎదురుగా
ఆర్.వీ.వి.కే. ప్రసాద్ ప్రధాన గేటు
2, 3, 4, 5 వ గేట్లు
ప్రధాన రోడ్డు నుంచి బి-మైదానం ప్రహరీల మధ్య వెళ్లే రహదారి చివర
ఏఎస్సార్ నగర్
6, 7, 8 వ గేట్లు
స్టేడియం వెనుక భాగంలో
సాంకేతిక కళాశాల రెండో గేటు సమీపంలో (ఏఎస్సార్ నగర్)
9 వ గేటు
స్టేడియం పక్కన ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం రోడ్డులో
ఆలయ పార్క్‌కు చేరువగా (హౌసింగ్‌బోర్డు కాలనీ)
10, 11 వ గేట్లు
వేంకటేశ్వరస్వామి ఆలయం ఎడమ వైపు ఉన్న మార్గం
(హౌసింగ్‌బోర్డు కాలనీ)
12, 13 వ గేట్లు
స్టేడియం దగ్గర విజయ ల్యాబ్ వెనుక వైపు
వేంకటేశ్వరాలయం రోడ్డులో (హౌసింగ్‌బోర్డు కాలనీ)
14, 15, 16 వ గేట్లు
జాతీయ రహదారికి ఎదురుగా ఎంఎస్కే ప్రసాద్ గేటు వద్ద
మన రుచులు హోటల్ ఇరువైపులా ప్రవేశం
17 వ గేటు
జాతీయ రహదారికి ఎదురుగా
ఫ్లడ్‌లైట్ స్తంభం పక్కన
మారుతీ డ్రైవింగ్ స్కూల్‌కు ఎదురుగా
18, 19, 20 వ గేట్లు
రిలయన్స్ ట్రెండ్స్ (జాతీయ రహదారిలో) ఎదురుగా
వై. వేణుగోపాలరావు గేటు పరిసరాల్లో
1వ గేటు పక్కనే











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!