
రాజకీయాలు

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ.586 కోట్ల వ్యయంతో మూడు దశలలో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టనుండగా, మొదటి దశకు రూ.276 కోట్లు కేటాయించారు. ఈ పనులు 2027 శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 26 నుంచి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి.
భక్త రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయాన్ని యథాతథంగా ఉంచుతూ, అనుబంధ ఆలయాలను రాతి నిర్మాణాలతో పునర్నిర్మించనున్నారు. పునరుద్ధరణ సమయంలో ఆర్జిత సేవలను మిథిలా స్టేడియంకు తరలించనుండగా, దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఆలయంలో ఉన్న 15 ఉప ఆలయాలు, 75 మూర్తులు, 3 గోపురాల అభివృద్ధిపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!