4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Priya 10:38 PM, 14 ఏప్రిల్, 2026
మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి

జగిత్యాల ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను నేతలతో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీవన్ రెడ్డిని తాము ఎప్పుడూ తక్కువగా చూడలేదని, ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తాము పూర్తిగా కృషి చేశామని సీఎం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించినప్పటికీ, ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరగా పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని తెలిపారు.

భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా వినలేదని సీఎం అన్నారు. చివరికి మొండి పట్టుతో ఆయన పార్టీని వీడి, 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను కూడా వదిలి, కేసీఆర్‌తో చేతులు కలిపారని విమర్శించారు. జీవన్ రెడ్డి వంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఏమీ మాట్లాడలేదని చెప్పారు. కుట్రలను తిప్పికొట్టేందుకు తాము ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ప్రత్యర్థి శిబిరంలో చేరారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే నిలబెట్టడం తప్పా అని ప్రశ్నించారు. తాను చేస్తున్నది మంచిదా చెడ్డదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని సీఎం అన్నారు. ఎవరు ఎవరో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. పార్టీకి అండగా నిలబడాలని, మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే జగిత్యాలలో కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. చివరగా వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
జగిత్యాల సమావేశంసీఎం రేవంత్ రెడ్డిజీవన్ రెడ్డికాంగ్రెస్ పార్టీకేసీఆర్రాజకీయ వ్యాఖ్యలుకార్యకర్తలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు
సినిమాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!