
జనరల్

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యోగా గురువు బాబా రామ్‌దేవ్ గారు, పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు సీఎం ఆహ్వానం మేరకు వారు రాష్ట్రానికి వచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో యోగా డే కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. యోగా ప్రచారం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!