
జనరల్

వంచిత్ బహుజన్ అగాడీ (వీబీఏ) అధినేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
సమావేశం అనంతరం కేటీఆర్, ప్రకాష్ అంబేడ్కర్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాకపోయినప్పటికీ, ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!