

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ అప్పర్ స్టేజ్ చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. గత ఏడాది జనవరిలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్, రెండు ప్రైవేట్ లూనార్ ల్యాండర్లను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత నియంత్రణ కోల్పోయింది. అనంతరం భూమి-చంద్రుడి మధ్య కక్ష్యలో తిరుగుతూ గురుత్వాకర్షణ ప్రభావంతో గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపై పడమటి భాగంలోని ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో కూలిపోయింది.
సుమారు 4,500 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ భాగం ఢీకొనడంతో 3 టన్నుల టీఎన్‌టీ పేలుడుతో సమానమైన శక్తి విడుదలై, చంద్రుడిపై కొత్త క్రేటర్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గుంత సుమారు 90 అడుగుల వ్యాసం మరియు 16 అడుగుల లోతు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన దనూరి స్పేస్‌క్రాఫ్ట్, నాసా లూనార్ రికన్నైజెన్స్ ఆర్బిటర్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించలేకపోయినా, ముందు మరియు తర్వాత తీసిన చిత్రాలను విశ్లేషించి వివరాలు వెల్లడించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!