

ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై భారత్‌లో మాత్రమే ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఈ విషయంపై మెటా ఇండియా కార్యాలయానికి పలుమార్లు ఈ-మెయిల్స్ పంపినప్పటికీ ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఖాతాపై ఉన్న ఆంక్షలు ఎలా తొలగించుకోవాలో కూడా ఎవరూ వివరించడం లేదని విమర్శించారు.
ఈ20 పెట్రోల్ వివాదం నేపథ్యంలో తన పోస్టుల వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నం జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని ముందు మెటా తలవంచిందని వ్యాఖ్యానిస్తూ సంస్థ సేవలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై మెటా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను తాత్కాలికంగా తొలగించిన ఘటనలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి గతంలో క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!