
జనరల్

నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో పింఛన్ తీసుకునేందుకు క్యూలో నిలబడి ఉన్న వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పోల్యానాయక్ తండాకు చెందిన రమావత్ గుగాని (65) ప్రతి నెల పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగించేది. ఆగస్టు నెల పింఛన్ కోసం వరుసగా మూడు రోజులుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముడుదండ్ల గ్రామానికి నడిచి వస్తున్నప్పటికీ, పోస్టుమాస్టర్ అందుబాటులో లేకపోవడంతో పింఛన్ పొందలేకపోయింది.
బుధవారం ఉదయం మళ్లీ పింఛన్ కోసం వచ్చి క్యూలో నిలబడిన గుగాని ముందు సుమారు 50 మంది ఉండగా, ఆన్‌లైన్ నెట్‌వర్క్ సమస్య వల్ల పంపిణీ ఆలస్యమైంది. గంటన్నర పాటు వేచి ఉన్న అనంతరం ఆమె ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందింది. పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం, సకాలంలో పింఛన్ అందకపోవడమే ఆమె మరణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!