

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాలతో పాటు మర్లకుంట, మంగగడ్డ తండాల రైతుల అంగీకారం లేని భూములను భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్), ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేశాయి. ఈ గ్రామాలు హైదరాబాద్‌కు పాలు, కూరగాయలు, ఆకుకూరలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నాయని, వాటిని నాశనం చేస్తే నగరంలో ఆహార భద్రతపై ప్రభావం పడుతుందని హెచ్చరించాయి.
ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను విడుదల చేసిన కమిటీ ప్రతినిధులు, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం భూసేకరణ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో అదే భూసేకరణ కొనసాగించడం బాధాకరమని విమర్శించారు. గ్రామసభలు నిర్వహించకుండా రైతుల భూములు స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!