
జనరల్

ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసిన మహనీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవి అని కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఉన్నత ఉద్యోగాలను వదిలి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
ప్రతి మనిషికి కూడు, గూడు దక్కాలనే లక్ష్యంతో పాటనే ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం నింపారని సీఎం పేర్కొన్నారు. ఆయన అందించిన సాంస్కృతిక, సాహిత్య సేవలకు గుర్తింపుగా గద్దర్ పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేసి సినీ ప్రముఖులకు అందజేస్తున్నామని గుర్తు చేశారు. గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!