

యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపు నిర్ణయం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ, పండుగల సీజన్ నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీపావళి తర్వాత ఛార్జీల విధింపుపై నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దీపావళి ముగిసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. దీంతో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల అమలు ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ ఛార్జీల విధింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే 2027 వేసవి తర్వాతే ఎండీఆర్ ఛార్జీల అమలుపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో కీలకంగా మారిన యూపీఐ సేవలపై ఛార్జీల విధింపు అంశం వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!