

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.58 వేల కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను దేశవ్యాప్తంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు వినియోగించనుంది. తద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని సంస్థ భావిస్తోంది.
ఇందులో భాగంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగు కొత్త పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమెజాన్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నింటి ద్వారా కలిపి 934 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ప్రాజెక్టులతో భారత్‌లో అమెజాన్ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. దేశంలో స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!