

కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ స్టాక్ మార్కెట్‌లో భారీ చరిత్ర సృష్టించింది. తన ఐపీవో ద్వారా ఏకంగా 81.3 బిలియన్ డాలర్లు సమీకరించి, సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించింది. ఈ పరిణామంతో సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల సంపద భారీగా పెరగనుంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం.. మొత్తం 5,300 మంది ఉద్యోగుల్లో సుమారు 4,250 మంది కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది. వీరిలో 1,200 మంది సంపద 10 మిలియన్ డాలర్లు దాటవచ్చని, మరో 50 మంది ఆస్తి 100 మిలియన్ డాలర్లకు మించవచ్చని అంచనా. ఈ పరిణామాన్ని 1984 నాటి అమెరికా గోల్డ్ రష్‌తో పోలుస్తున్నారు. ఉద్యోగుల సంపద పెరుగుదలతో పాలో ఆల్టో సమీపంలోని అథెర్టన్ ప్రాంతంలోని స్థిరాస్తి మార్కెట్‌పైనా ఆసక్తి పెరిగింది. అక్కడ సింగిల్ ఫ్యామిలీ ఇంటి సగటు ధర 10.73 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఆంథ్రోపిక్ ఒక్కో షేరును 83 డాలర్లకు విక్రయిస్తూ మొత్తం 980 మిలియన్ షేర్లను ఐపీవోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత 825 మిలియన్ షేర్లను మాత్రమే విక్రయించాలని భావించినప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా సంఖ్యను పెంచింది. ఈ ఐపీవోతో గతంలో స్పేస్‌ఎక్స్ నెలకొల్పిన రికార్డును అధిగమించింది. నాస్‌డాక్ మార్కెట్‌లో ANT టిక్కర్‌తో షేర్లు ట్రేడింగ్‌కు రానున్నాయి. క్లాడ్ కోడ్ వంటి ఏఐ ఉత్పత్తుల ద్వారా ఆదాయం వేగంగా పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అయితే భారీ మౌలిక సదుపాయాల వ్యయాలు, నిర్వహణ నష్టాలు సంస్థకు సవాళ్లుగా మారాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాలకు ఈ సంస్థలో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!