

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన రెబల్ 500 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధరను రూ.4.50 లక్షలుగా, ఇ-క్లచ్ వెర్షన్ ధరను రూ.4.90 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. గతంలో ఈ మోడల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించేవారు. అప్పట్లో దిల్లీలో దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ.5.12 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం ఇందులో 50 శాతం విడిభాగాలను దేశీయంగా తయారు చేస్తుండటంతో ధర సుమారు రూ.62 వేలు తగ్గింది.
రెబల్ 500లో 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 46 హెచ్‌పీ శక్తిని, 6,000 ఆర్‌పీఎం వద్ద 43.3 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇ-క్లచ్ వేరియంట్‌లో క్లచ్ లివర్‌ను ఉపయోగించకుండానే బైక్‌ను స్టార్ట్ చేయడం, ఆపడం, గేర్లు మార్చడం సాధ్యమవుతుంది. అవసరమైనప్పుడు మాన్యువల్ క్లచ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!