

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెన్ను గాయానికి గురైన కమిన్స్ ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఒకే టెస్టు మాత్రమే ఆడాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ తొలి కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం.
కమిన్స్ అందుబాటులో లేకపోతే తాత్కాలికంగా జట్టును ఎవరు నడిపిస్తారన్న చర్చ కొనసాగుతోంది. ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ కెప్టెన్సీ చేపట్టవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ఇషాన్ కిషన్ పేరు కూడా వినిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన సారథ్యంలో ఝార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతణ్ని రూ.11.25 కోట్లకు కొనుగోలు చేయడంతో అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలపై చర్చ సాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!